Homeఆంధ్ర ప్రదేశ్రాజకీయాలకు చిరు శాశ్వత దూరం!

రాజకీయాలకు చిరు శాశ్వత దూరం!

-ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ నియామకం వదంతు
-అభిమానులు నమ్మవద్దు
-మెగాస్టార్ టీం ప్రత్యేక విజ్ఞప్తి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:-ఏపీ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవిని ప్రభుత్వం నియమించబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తారని టాక్ నడిచింది. గతంలో గుజరాత్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరు మాదిరిగానే.. రాజశేఖర్ రెడ్డి హయాంలో నాగార్జున తరహా లోనే.. ఏపీ పర్యాటక పెట్టుబడుల ప్రచారం కోసం చిరంజీవిని రప్పించేందుకు చర్చలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి టీం స్పందించింది.

రాజకీయ ముద్ర..
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే చిరంజీవి తనదైన ముద్ర చాటుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కేవలం 18 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ 70 లక్షల వరకు ఓట్లు సొంతం చేసుకున్నారు. కానీ కొద్ది కాలానికే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పతనం అయింది. ఆపై కేంద్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది. అప్పటినుంచి రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. అన్ని పార్టీలతో సఖ్యతగా మెలుగుతూ ముందుకు సాగారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతు ప్రకటించారు. తద్వారా తన మద్దతు కూటమికేనని అభిమానులకు సంకేతాలు పంపారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా ప్రచారం నడిచింది. ఇప్పుడు కూటమి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల అది ఇంకా ఎక్కువైంది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చింది.

ఆ ప్రచారాన్ని నమ్మవద్దు..
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి నియామకం కానున్నారు అంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని ఆ టీం తేల్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. అటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దని.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రచారం చేయవద్దని మెగా అభిమానులకు, సాధారణ ప్రజలకు స్పష్టమైన విజ్ఞప్తి చేసింది.

అమితాబ్ బచ్చన్ మాదిరిగా..
ఏపీలో కూటమి వచ్చిన తరువాత చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో సినీ ప్రముఖులతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ లో అమితాబ్ బచ్చన్ పరహాల్లో చిరంజీవిని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. ఇప్పటికే బీజేపీ సైతం రాజ్యసభ ఆఫర్ చేయగా మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారు. పూర్తిస్థాయి రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే చిరంజీవి పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు దీనిపై పూర్తి స్పష్టతనిచ్చినట్లు అయింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు