Homeఅంతర్జాతీయంఫుట్‌బాల్ దిగ్గ‌జానికి ఘ‌న వీడ్కోలు...! తీవ్ర భావోద్వేగానికి గురైన మెస్సీ...

ఫుట్‌బాల్ దిగ్గ‌జానికి ఘ‌న వీడ్కోలు…! తీవ్ర భావోద్వేగానికి గురైన మెస్సీ…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఫుట్‌బాల్ అన‌గానే గుర్త‌కొచ్చే పేరు….ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు, అర్జెంటీనాకు జాతీయ జ‌ట్టుకు రెండు ద‌శాబ్దాలుగా ఎన్నో అద్భుత విజ‌యాలు క‌ట్ట‌బెట్టిన ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆటగాడు లియోన‌ల్ మెస్సీ. చివ‌రిసారిగా జాతీయ జెర్సీతో మైదానంలో త‌న చివ‌రి మ్యాచ్ ఆడేశాడు. బెనిన్‌తో జ‌రిగిన స్నేహ‌పూర్వ‌క మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో ఘ‌న విజ‌యం సాధించింది. ఇటీవ‌ల‌నే అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే.

అర్జెంటీనా జాతీయ జట్టుకు మెస్సి అందించిన మరపురాని విజయాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు కన్నీళ్లతో తమ హీరోకు వీడ్కోలు పలికారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే మెస్సి వీడ్కోలు కార్యక్రమాలు మొదలయ్యాయి. మోన్యుమెంటల్‌ స్టేడియంలో నంబర్‌-10 భారీ జెర్సీని ఏర్పాటు చేశారు. దానిపై ‘గ్రేసియాస్‌’ (ధన్యవాదాలు) అని రాసి ఉంది. మెస్సికి అభిమానులు చెప్పాలనుకున్న మాటను ఆ ఒక్క పదమే చెప్పేసింది. మెస్సి తన ముగ్గురు కుమారులు థియాగో, మాటియో, సిరోతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బాణసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోయింది. గీతం కొనసాగుతున్న సమయంలో మెస్సి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోచ్‌ లియోనెల్‌ స్కలోనీ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కాగా బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోన్యుమెంటల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌.. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లా కాకుండా మెస్సికి ఘన వీడ్కోలు వేడుకగా మారిపోయింది.

ఇవి కూడ చ‌ద‌వండి
  1.  ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 10 సీఎన్‌జీ ఏసీ బస్సులు దగ్ధం
  2. ఇలాంటి దొంగల్ని మీరేప్పుడూ చూసి ఉండరు…!
  3.  టొరంటో యూనివర్సిటీ భారీ స్కాలర్‌షిప్.. ఒక్కో పీహెచ్‌డీ విద్యార్థికి రూ.3 కోట్లకుపైగా!
  4. పనిచేయని బిజెపి నేతలు అవుట్…!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు