-
కరోనా లాంటి మరో ఆరోగ్య సంక్షోభం సిద్ధం
-
రష్యా నుంచి సంకేతాలు
-
గోప్యంగా ఉంచుతున్న అక్కడి ప్రభుత్వం
-
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గడగడలాడారు. వైరస్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది బాధితులుగా మారారు. వేలాది మంది ప్రాణాలు వదిలారు. అయితే అటువంటి వైరస్ మరొకటి ప్రపంచానికి ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. రస్యాలోని సైబీరియాలో వెలుగు చూసిన ఘటన ప్రపంచానికి పరుగులెట్టిస్తోంది. ఓ యాంటీ ప్లేగు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న 28 సంవత్సరాల దరియా షిప్పిలోవా అనే మహిళ అనుమానాస్పద మృతి ప్రపంచాన్నే కలవరపరుస్తోంది.
ఆమె పనిచేస్తున్న సమయంలో టెస్ట్ ట్యూబ్ పగిలి ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించింది. తీవ్రమైన నిమోనియాతో ఆమె మృతి చెందడం కలకలం రేపింది.
-
అంతటా ఆందోళనకరం..
రష్యాలో వెలుగు చూసిన ఈ ఘటన సర్వసాధారణం అయినదని ఎవరూ భావించడం లేదా. ఇది సాధారణ ల్యాబ్ సంఘటన కాదు అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అక్కడి నుంచి ప్రాణాంతకమైన ప్లేగు వైరస్ లేదా బ్యాక్టీరియా లీక్ అయిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మృతురాలితో సన్నిహితంగా మెలిగిన వారు, ఆసుపత్రిలో చికిత్స అందించిన దాదాపు 200 మందికి అత్యవసరంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి.. క్వారంటైన్ చేయడం అనుమానాలను మరింతగా పెంచింది.
ఇది గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాపించే న్యూమోనిక్ ప్లేగు కావచ్చని.. రష్యన్ ఆరోగ్య అధికారులు దీనిని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారని అనుమానాలు, విమర్శలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వర్గాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.
-
కళ్ళముందే కరోనా విపత్తు..
కరోనా విసిరిన విపత్తు గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తించుకునే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ వైరస్ ద్వారా జరిగే విపత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ధారణ జరగలేదు.
కానీ అంతర్జాతీయ వైద్య నిపుణులు, గ్లోబల్ హెచ్ఐవి, వైరాలజీ నిపుణులు దీనిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోవిడ్ 19 మహమ్మారికి ముందు చైనాలో ఓ ల్యాబ్ లో గురించి వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన కూడా అటువంటి పరిస్థితిని గుర్తు చేస్తోంది.
ప్లేగు వంటి భయంకరమైన వ్యాధి కారకాలు మళ్ళీ మానవాళిపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే చాలా కాలం కిందటే ప్లేగు లాంటి భయంకరమైన జయించామని ప్రపంచం చెప్పుకుంటుంది. కానీ తాజాగా పెను విపత్తు ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది.
