Homeఆంధ్ర ప్రదేశ్పెద్ద‌పులి క‌ల‌క‌లం...! భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు...

పెద్ద‌పులి క‌ల‌క‌లం…! భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు…

తూర్పుగోదావ‌రి, క్రైమ్‌మిర్ర‌ర్‌: తూర్పుగోదావ‌రి జిల్లాలో పెద్ద‌పులి సంచారంతో క‌ల‌క‌లం రేపుతోంది. సుమారు ప‌ది నెల‌లుగా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న పెద్ద‌పులి ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోకి ప్ర‌వేశించింది. తాళ్లపూడి మండలం గజ్జరం, తుపాకుల గూడెం, గోపాలపురం మండలం గోపవరం ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. మైదాన ప్రాంతాల వైపు పులి రావడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తోంది, ఏ దిశగా కదులుతోందనే విషయాలను రేడియో ట్రాకింగ్ ద్వారా గమనిస్తూ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. బెంగళూరులో సంచలనం.. ఖైదీ భార్యపై లైంగిక దాడి, నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఖైదీ విడుదల
  2. 22ఏ భూములకు గుడ్‌న్యూస్.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్!
  3.  బర్డ్‌ఫ్లూ కలకలం…2,500 నాటుకోళ్లు మృతి…!
  4. గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌పై అనుమానాలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు