Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ నేత ఇంట్లో భారీగా అక్రమ మద్యం.. 1,341 బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్!

వైసీపీ నేత ఇంట్లో భారీగా అక్రమ మద్యం.. 1,341 బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ మద్యం నిల్వల వ్యవహారం కలకలం రేపింది. నందిగామ మండలంలోని ఓ వైసీపీ నేత నివాసంలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 1,341 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలం కొండూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత తోట నరేశ్ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.

పోలీసులు మొత్తం 1,341 బాటిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఇంటి యజమాని తోట నరేశ్‌తో పాటు అద్దంకి ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఇంత పెద్ద మొత్తంలో మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి విక్రయించేందుకు నిల్వ చేశారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

also read: వైసిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా భారతి రెడ్డి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు