Homeఆంధ్ర ప్రదేశ్ఉత్తరాంధ్రలో జనసేన పాగా...!

ఉత్తరాంధ్రలో జనసేన పాగా…!

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం

  • తాజాగా రెండు జిల్లా పరిషత్తులు కైవసం

  • రెండు కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీలు సైతం..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర పై జనసేన ఫుల్ ఫోకస్ పెట్టిందా? బలం పెంచుకోవాలని భావిస్తోందా? తమ స్థానం సుస్థిరం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోందా? ఆ విషయంలో సక్సెస్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2029లో సీట్లు పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థం అవుతోంది. ఉభయగోదావరి జిల్లాల తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర పైనే ఆ పార్టీ ఫోకస్ చేయడం వెనుక భవిష్యత్తు వ్యూహం ఉన్నట్లు స్పష్టమౌతోంది. జిల్లా పరిషత్తులతో పాటు మేయర్ పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులను ఒక వ్యూహం ప్రకారమే ఆ పార్టీ కోరుతోంది అని అర్థమవుతోంది.

క్రమేపి బలం పెంచుకొని…

2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో అద్భుత విజయం సాధించింది జనసేన. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం అందరూ గెలిచారు. గెలిచిన 21 మందిలో ఉత్తరాంధ్ర నుంచి ఆరుగురు ఉన్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రాతినిధ్యం పెంచుకుంది జనసేన. విజయవాడ మేయర్ అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఏలూరు మేయర్ స్థానాన్ని సైతం సొంతం చేసుకుంది జనసేన. కాకినాడ తో పాటు శ్రీకాకుళం మేయర్ పదవుల కోసం గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఉత్తరాంధ్రలో మూడు జడ్పీ స్థానాలు జనసేన ఖాతాలో పడ్డాయి. శ్రీకాకుళం జడ్పీ తో పాటు పార్వతీపురం మన్యం సైతం జనసేనకి దక్కింది.

పెరుగుతున్న ప్రాతినిధ్యం…

పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పాలకొండలో ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 జడ్పీటీసీలు ఉంటే అందులో టిడిపి 7, వైసీపీ 5, జనసేన ఇది చోట్ల గెలిచాయి. ఇదే జిల్లాలో సాలూరు మున్సిపల్ చైర్మన్ పీఠం జనసేనకి దక్కింది. పాలకొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం జనసేన దక్కించుకుంది. అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠాన్ని జనసేన తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాల్లో బలం పుంజుకుంది జనసేన. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక శక్తిగా మారింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. యలహంక ప్యాలెస్ వివాదం.. నేడే కీలక విచారణ!
  2.  బిస్లరీ వాటర్ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం, చట్టపరమైన చర్యలకు సిద్ధమైన FSSAI!
  3.  భాగ్యనగరానికి ఉగ్ర హెచ్చరిక.. బాంబులు పెడతామంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్!
  4. ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు