Homeక్రైమ్ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందని ఆగ్రహం.. ప్రియుడి చేతిలో యువతి హత్య..

ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందని ఆగ్రహం.. ప్రియుడి చేతిలో యువతి హత్య..

క్రైమ్ మిర్రర్ : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందన్న ఆగ్రహంతో ప్రియుడే ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సోలైపుదురు గ్రామానికి చెందిన 17 ఏళ్ల అబర్ణ ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్లంబర్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల ముత్తురాజ్‌తో ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. అయితే, ఇతర అబ్బాయిలతో మాట్లాడవద్దని ముత్తురాజ్ గతంలో పలుమార్లు అబర్ణను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె అతని మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

ఈ క్రమంలో శనివారం ఉదయం అబర్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కత్తి, విషంతో ముత్తురాజ్ అక్కడికి చేరుకున్నాడు. ఇతర అబ్బాయిలతో మాట్లాడే విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన మాట వినేందుకు అబర్ణ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముత్తురాజ్, ముందుగా ఆమె గొంతు నులిమాడు. అనంతరం ఎడమ వైపు ఛాతి కింది భాగంలో, వీపుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అబర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

యువతి మృతి చెందిన తర్వాత ముత్తురాజ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఎడమ మణికట్టును కోసుకుని, కొంత విషాన్ని సేవించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడు ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స నిమిత్తం అతడిని తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అబర్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అదే ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి దారి తీసింది. తూత్తుకుడి ఎంపీ, డీఎంకే నేత కనిమొళి ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో టీవీకే ప్రభుత్వ నిబద్ధతను ఆమె ప్రశ్నించారు.
also read : యలహంక ప్యాలెస్ వద్ద హైటెన్షన్.. బెంగళూరు చేరుకున్న షర్మిల.. అప్రమత్తమైన పోలీసులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు