Homeక్రైమ్అనుమానంతో దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మహిళ మృతి

అనుమానంతో దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మహిళ మృతి

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో ప్రేమలో ఉన్న మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. శుక్రవారం రాత్రి నల్లగొండ మండలం తొరగల్లు గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దుర్గి మండలం ముత్తుకూరుకు చెందిన మెగావత్ హనుమాన్ నాయక్ కొంతకాలంగా తొరగల్లు గ్రామంలో నివసిస్తున్నాడు. ధాన్యం పట్టాలను కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మరణించడంతో ఒంటరిగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో నిడమనూరు మండలం సూరెపల్లి గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి రమణ (34)తో అతడికి పరిచయం ఏర్పడింది. ధాన్యం పట్టాలను కిరాయికి ఇచ్చే సమయంలో మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే రమణకు అప్పటికే వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం హనుమాన్ నాయక్‌ను కలిసేందుకు రమణ తొరగల్లు గ్రామానికి వచ్చింది. ఆమెకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందనే అనుమానం హనుమాన్ నాయక్‌లో ఉండటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన హనుమాన్ నాయక్ రమణపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.

మంటలు వ్యాపించడంతో రమణ తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది.

ఈ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

also read: జబర్దస్త్ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు