Homeక్రైమ్జబర్దస్త్ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలు!

జబర్దస్త్ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ సభ్యులకు జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న జబర్దస్త్ టీమ్ సభ్యులు గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరుతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

also read: ఆదిలాబాద్‌లో కలకలం.. ఆముదం గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు