Homeసినిమా"మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించేందుకైనా రెడీ"- అనుపమ పరమేశ్వరన్

“మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించేందుకైనా రెడీ”- అనుపమ పరమేశ్వరన్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని ఆసక్తికరంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. మహేష్ బాబుపై తనకున్న ఇష్టాన్ని సరదా వ్యాఖ్యలతో వ్యక్తం చేశారు.

మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆమె.. ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా, విలన్ పాత్ర పోషించాల్సి వచ్చినా ఏమాత్రం వెనుకాడనని తెలిపారు. కథలో తన పాత్ర ఎలా ఉన్నా నటించేందుకు సిద్ధంగా ఉంటానని తన మనసులోని మాటను బయటపెట్టారు.

అయితే మహేష్ బాబు అందం ముందు విలన్‌గా కోపంగా నటించడం అంత సులభం కాదని అనుపమ చమత్కరించారు. ఆయనను చూస్తూ కోపంగా నటించాలంటే కష్టమేనని, బహుశా డైలాగులు కూడా మర్చిపోయే అవకాశం ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మహేష్ బాబుపై ఆమెకున్న అభిమానాన్ని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

also read: కలలో కనిపించిన వజ్రాలు.. నిజ జీవితంలో వరించిన అదృష్టం.. ఆటో డ్రైవర్‌కు రూ.15 లక్షల విలువైన వజ్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు