క్రైమ్ మిర్రర్ : వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు వెళ్తున్న ఆటో బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతులను నాగేశ్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.
also read ; ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. ప్రజాతీర్పుపై సీఎం చంద్రబాబు హర్షం!
