Homeతెలంగాణఉపాధి కల్పిస్తున్నారా.. ఉసురు తీస్తున్నారా?

ఉపాధి కల్పిస్తున్నారా.. ఉసురు తీస్తున్నారా?

– రోజంతా కష్టపడితే చేతికి వచ్చేది రూ.150 మాత్రమేనా?
– సూరారం ఉపాధి హామీ కూలీల తీవ్ర ఆవేదన
– అధికారులు స్పందించాలని వేడుకోలు

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :- రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం ఒక ఆధారంగా నిలవాల్సి ఉండగా, సూరారం గ్రామంలో మాత్రం కూలీలకు నిరాశే మిగులుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. రోజంతా ఎండనకా, వాననకా కష్టపడి పనిచేస్తున్నా తమ ఖాతాల్లో రోజుకు కేవలం రూ.150 మాత్రమే జమ అవుతున్నాయని ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనులపై ఆధారపడుతున్న తమకు రోజంతా శ్రమించినా ఆశించిన స్థాయిలో కూలి అందకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ ఖర్చుల మధ్య రూ.150తో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

శ్రమకు తగిన ప్రతిఫలం ఏది?

ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు వేతనాలు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు? పని కొలతలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? హాజరు, పని దినాలు, కొలతల నమోదులో ఏమైనా లోపాలు ఉన్నాయా? కూలీలకు తక్కువ వేతనం రావడానికి అసలు కారణమేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అధికారులు స్పందించరా?

సూరారం ఉపాధి హామీ కూలీల ఆవేదనను సంబంధిత అధికారులు తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కూలీల పని వివరాలు, మస్టర్ రోల్స్, పని కొలతలు, వేతనాల చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోపాలు ఉంటే సరిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కష్టానికి తగిన కూలి అందక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే సంబంధిత అధికారులు మౌనం వహించడం ఎంతవరకు సమంజసం? కూలీల సమస్యకు పరిష్కారం చూపించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? కూలీల శ్రమకు గౌరవం దక్కాలి.. వారి హక్కులకు భరోసా కల్పించాలి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు