క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, సర్జరీ అనంతరం బాలిక గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయని వివరించారు.
నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం..!
చికిత్సలో భాగంగా బాలిక ఎడమచేతికి వేసిన కట్టును తొలగించడంతో, ఆమె ఇప్పుడు చేయి కదిలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆమెకు వైద్యులు నిరంతరం అవసరమైన మందులు, బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, త్వరలోనే ఆమెను ఐసీయూ (ICU) నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు వైద్యుల బృందం సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
