Homeతెలంగాణవర్క్ ఫ్రం పార్క్...!

వర్క్ ఫ్రం పార్క్…!

  • ఇండోర్ వాతావరణంతో అలసటకు గురవుతున్న ప్రొఫెసనల్స్

  • ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు నిర్ణయం

  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కాన్సెప్ట్…

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: వర్క్ ఫ్రం ఆఫీస్.. వర్క్ ఫ్రం హోం.. ఇలా పని చేసే ప్రదేశాలు మారాయి. పని చేసేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించారు. అయితే ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టనుంది. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల నీడన కూర్చుని.. హాయిగా ఆఫీస్ వర్క్ లేదా చదువుకునేలా సైబరాబాద్ పరిధిలోని ఎంపిక చేసిన పార్కుల్లో.. వర్క్ ఫ్రం పార్కు కాన్సెప్ట్ అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉచిత వైఫై, పవర్ పాయింట్లు, కాఫీ కియోస్క్ లతో కూడిన ఓపెన్ ఎయిర్ వర్క్ స్పేస్ లు త్వరలోనే ఐటి ఉద్యోగులు, విద్యార్థులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.

300 పార్కుల ఏర్పాటు…

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా కొత్తగా అభివృద్ధి చేయనున్న 300 పార్కుల్లో భాగంగా.. ఈ వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పార్కులను కేవలం ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్, వ్యాయామాలు, వినోదానికి మాత్రమే పరిమితం చేయకుండా.. ఫ్రీ లాన్సర్లు, రిమోట్ వర్కర్లు, స్టార్టాప్ టీం లు, విద్యార్థులకు అనుకూలమైన ఇన్ ఫార్మల్ వర్క్ స్పేస్లు గా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ యుగంలో మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగా.. సైబర్ హుడ్ పార్కులను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్ని రకాల వసతులు…

వర్క్ ఫ్రం పార్క్ కు సంబంధించి ప్రాంగణాల్లో పనిచేయడానికి అవసరమైన కార్పొరేట్ తరహా మౌలిక సదుపాయాలను అధికారులు సమకూర్చనున్నారు. అందులో భాగంగా ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జ్ చేసుకోవడానికి పవర్ ఔట్లెట్లు, సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా ప్రత్యేక బెంచీలు, మెట్ల తరహా సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు హై స్పీడ్ ఉచిత వైఫై కనెక్టివిటీ, భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అలసట తీర్చేందుకు కాఫీ, ఈ స్నాక్స్ కియోస్క్ లు అందుబాటులో ఉంటాయి. పని మధ్యలో చిన్న విరామం తీసుకుని ప్రశాంతంగా అడుగులు వేసేందుకు వాకింగ్ ట్రాక్ లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లో తొలి విడతలో స్మార్ట్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. మాధవ హిల్స్ కాలనీలో 1.5 ఎకరాల పార్కులో దాదాపు 700 చదరపు గజాల స్థలాన్ని వర్క్ స్పేస్ కోసం ప్రత్యేకిస్తుండగా.. మసీదు బండ ప్రాంతంలోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూకట్పల్లి జోన్ లోని మాదాపూర్ ప్రాంతంలో వర్క్ పార్కుల కోసం అనువైన స్థలాలను గుర్తించి డిజైన్లను సిద్ధం చేశారు. సిటీలోని వర్కింగ్ ప్రొఫెషనల్ నిరంతరం ఒత్తిడితో కూడిన ఇండోర్ వాతావరణంతో పని చేయడం వల్ల కలిగే అలసటను తగ్గించి.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు