Homeతెలంగాణతెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు...! కలెక్టర్ కు 6 నెలల జైలు శిక్ష.

తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు…! కలెక్టర్ కు 6 నెలల జైలు శిక్ష.

  • రెండు వేల రూపాయల జరిమానా సైతం

  • కోర్టు ధిక్కరణ ఫలితం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేసిన వ్యవహారంలో న్యాయమూర్తి సంచలన ఆదేశాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలంటూ దాఖలైన వినతి పత్రాన్ని పరిశీలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను దిక్కరించినందుకుగాను ఆయనకు శిక్ష పడింది. ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కలెక్టర్ వైఖరి ఉద్దేశపూర్వక, స్పష్టమైన కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఈ ఆదేశాలపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. జైలు శిక్ష అమలు నాలుగు వారాల పాటు న్యాయస్థానం సస్పెండ్ చేసింది.

కోర్టు ఆదేశించినా...

రంగారెడ్డి జిల్లాలో 2022 ఆగస్టులో అప్పటి కలెక్టర్ తీసుకున్న నిర్ణయం.. సెప్టెంబరులో జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం వివాదాస్పద భూములకు సంబంధించిన కొన్ని ప్లాట్లను.. నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అనుమతించారు. పక్కనే ఉన్న ఇతర ప్లాట్ లను ఆ జాబితా నుంచి తొలగించినప్పటికీ.. తమ భూములపై ఆంక్షలు కొనసాగుతుండడంతో నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలని కోరుతూ బాధితులు అధికారులను ఆశ్రయించారు. దీనిపై 60 రోజుల్లో గా నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ కలెక్టర్ నారాయణరెడ్డి గడువులోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కంటెంప్ట్ దాఖలైన తరువాతే కలెక్టర్ బాధితులకు నోటీసులు జారీ చేయడం, అనంతరం ఫిబ్రవరి 26న, మళ్లీ జూలై 8న వారి దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పై తాజాగా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కలెక్టర్ నివేదించినా…

మరోవైపు కోర్టుకు కలెక్టర్ నారాయణ రెడ్డి పలు విషయాలను సమర్పించారు. దీనిపై కూడా న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీవో, తహసిల్దార్ ల నుంచి నివేదికలు తెప్పించుకుని.. విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారిక రికార్డులు అందుకు భిన్నంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఫిబ్రవరి 21 నాటి విచారణ ప్రొసీడింగ్స్ లో ఆర్డీవో, తహసిల్దార్, సంబంధిత అధికారుల సంతకాలు కాలమ్ లు ఖాళీగా ఉండడాన్ని ధర్మాసనం ఎత్తి చూపింది. ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీడవిట్ లో పేర్కొన్న అంశాలు పచ్చి అబద్ధాలు అని న్యాయమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంలో ఉన్న నాలుగు సర్వే నంబర్లలో.. సర్వే నంబర్ 537 ను నిషేధిత జాబితా నుంచి తొలగించి.. మిగిలిన 536, 657, 658 సర్వే నంబర్లను మాత్రం ఆంక్షలు లోనే ఉంచడం పై అధికారులు ద్వంద వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.

కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ…

మరోవైపు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. అమలు చేసేందుకు తగినంత గడువు లభించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేశారని హైకోర్టు నిర్ధారించింది. బాధితుల హక్కులను కాలరాస్తూ.. న్యాయవ్యవస్థ ఆదేశాలకు నిర్లక్ష్యం చేసిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ కలెక్టర్కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులైనా సరే.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రెవెన్యూ తో పాటు బ్యూరోక్రసీ వ్యవస్థలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు