బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్ ఇండియా’ కవర్ పేజీపై ఆమె దర్శనమిచ్చారు. నవంబర్-డిసెంబర్ 2026 సంచిక కోసం నిర్వహించిన ప్రత్యేక ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
విక్కీ కౌశల్‌తో కలిసి వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన కత్రినా.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ప్రత్యేక ఫొటోషూట్‌లో పాల్గొనడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక ఒత్తిళ్లపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు వీలైనంత త్వరగా పూర్వపు శరీరాకృతిని పొందాలనే సామాజిక ఒత్తిడిని కత్రినా తప్పుబట్టారు. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చే మార్పులను సహజంగా స్వీకరించాలని, వాటిని గౌరవించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇతరుల అంచనాలకు అనుగుణంగా కాకుండా.. మహిళలు తమకు నచ్చిన విధంగా, తమ సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.
అలాగే తన వ్యక్తిగత జీవితం, మాతృత్వం, బ్యూటీ బ్రాండ్ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు కత్రినా పేర్కొన్నారు. ఈ ఫొటోషూట్ ద్వారా అందం అంటే కేవలం బాహ్య రూపం మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసం, స్వీయ అంగీకారం కూడా అందులో భాగమేననే సందేశాన్ని ఆమె మరోసారి చాటిచెప్పారు.
also read: కూతురితో ప్రేమాయణం.. ఉద్యోగిని కొట్టి చంపిన వ్యాపారవేత్త!
