Homeక్రైమ్అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దారుణ హత్య..

అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దారుణ హత్య..

క్రైమ్ మిర్రర్ : నగరంలో అర్ధరాత్రి వేళ హత్య ఘటన కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో ఓ వ్యక్తిని దుండగుడు బండరాయితో మోది హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. షాబాద్ ప్రాంతానికి చెందిన మడ్డి సుధాకర్ అలియాస్ సిద్దు స్థానికంగా ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో సుధాకర్‌పై దాడి జరిగింది.

అశోక్‌నగర్‌కు చెందిన ఇబ్రహీం బేగ్ అనే వ్యక్తి బండరాయితో సుధాకర్ తలపై బలంగా మోది హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్ర గాయాలతో సుధాకర్ ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి వేళ జనసంచారం ఉండే బస్టాండ్ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దారుణ ఘటన వెనుక అసలు కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడా? లేక ఇద్దరి మధ్య గతంలో ఏవైనా గొడవలు, పాత కక్షలు ఉన్నాయా? అనే కోణాల్లో చర్చ జరుగుతోంది.
also read : బీజాపూర్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్.. పేలుడు పదార్థాలు స్వాధీనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు