-
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
భూ సమీకరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారం
-
పూర్తి చట్టబద్ధత
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నూతన ల్యాండ్ పూలింగ్ చట్టం అమల్లోకి వచ్చింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల వేగానికి భూసేకరణ వివాదాలు ప్రతి బంధకంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, సాటిలైట్ టౌన్షిప్ ల నిర్మాణంలో ఎదురవుతున్న భూ సమీకరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారంగా… నూతన ల్యాండ్ ఫూలింగ్ పాలసీకి చట్టబద్ధత కల్పించే దిశగా నోటీసులు విడుదల చేసింది. దశాబ్దాలుగా నష్టపరిహారం చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం, న్యాయపరమైన వివాదాలు, రైతుల ఆందోళనలకు స్వస్తి పలికి, ప్రాజెక్టు నిర్వాసితులను నేరుగా ప్రాంతీయ అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం.
మెరుగైన ప్లాట్లు తిరిగి…
భూములు కోల్పోయే రైతులకు కేవలం ఒకేసారి నగదు రూపంలో పరిహారం ఇచ్చి వదిలేయకుండా.. వారు కోల్పోయిన భూమిని పటిష్టంగా అభివృద్ధి చేసి అందులో మెరుగైన ప్లాట్లను తిరిగి కేటాయిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర మోడల్ ఆధారంగా ప్రతిపాదించిన ఈ చట్టంలో.. సేకరించిన ఎకరం భూమికి గాను సుమారు 600 నుంచి 1000 చదరపు గజాల మేర డెవలప్ చేసిన నివాస లేదా వాణిజ్య ప్లాట్లను రైతులకు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక భూమి విలువ భారీగా పెరుగుతుంది కాబట్టి నష్టపరిహారం కంటే ఈ అభివృద్ధి చెందిన ప్లాట్ ల వల్ల.. రైతులకు సుదీర్ఘకాలంలో అధిక ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వ అంచనా.
నిబంధనల అమల్లో పక్కాగా…
హెచ్ఎండిఏ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వంటి కొన్నిచోట్ల కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు ఆధారంగానే ల్యాండ్ పూలింగ్ చేపట్టారు గతంలో. అయితే స్పష్టమైన చట్టబద్ధత లేకపోవడంతో.. నిబంధనల అమలులో అనేక వ్యత్యాసాలు రావడం, ప్లాట్ల కేటాయింపులు ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం రాబోతున్న ప్రత్యేక శాసనంతో ల్యాండ్ రీ కాన్స్టిట్యూషన్ ఆఫీస్, సాంకేతిక కమిటీలు, ఆపిల్ బోర్డు వంటి చట్టబద్ధమైన వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. ఇది భూ సమీకరణ ప్రక్రియకు సమగ్ర రక్షణ కల్పించడంతోపాటు పారదర్శకతను, కాల పరిమితితో కూడిన ప్లాట్ల కేటాయింపును హామీ ఇస్తుంది.
గేమ్ చేంజర్ …
ప్రధానంగా 340 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కారిడార్ పొడువున పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు, భవిష్యత్తు ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారనుంది. ఒకవైపు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం పడే అదనపు ఆర్థిక భారం గణనీయంగా తగ్గడమే కాకుండా.. మరోవైపు ప్రాజెక్టు ప్రాంత పరిసర రైతులకు సైతం ఆస్తి విలువ పెరిగి.. ఆర్థిక స్థిరత్వం లభించనుంది. చట్టబద్ధమైన గ్యారెంటీ ఉండడం వల్ల వివాదాలు తగ్గడంతో పాటు తెలంగాణ అంతటా రవాణా, ఇన్ఫ్రా నిర్మాణాలు నిరంతరాయంగా ముందుకు సాగుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
-
దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
-
అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
-
చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి .. ఘటనపై అనుమానాలు!
