Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ ప్రభుత్వానికి షాక్...!

ఏపీ ప్రభుత్వానికి షాక్…!

  • బీసీ రిజర్వేషన్లు 34 శాతం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

  • హైకోర్టు తీర్పునకు సమర్ధన

  • పార్టీ పరంగా అమలు చేసేందుకు టిడిపి నిర్ణయం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పు వెళ్లడయింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం.

ఎస్సీ, ఎస్టీ,బీసీ రిజర్వేషన్ల మొత్తం కోట 50% సీలింగ్ మించకూడదన్న హైకోర్టు నిర్ణయం సరైనదేనని స్పష్టం చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవులను తప్పు పట్టింది. దీంతో 34% రిజర్వేషన్లు అనేది పార్టీల పరంగా అమలు చేసే వీలుంది.

  • కొట్టివేసిన హైకోర్టు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 34% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ జీవోను రద్దు చేసింది.

అయితే దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈరోజు ఇరువర్గాల వాదనలు జరిగాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట నిచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

దీంతో తెలుగుదేశం కూటమి పార్టీల పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందకు పైగా మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో 34 శాతం పదవులను బీసీలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • విరుద్ధమని తేల్చి చెప్పిన న్యాయస్థానం..

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అనే రాజ్యాంగబద్ధమైన నిబంధనను సుప్రీంకోర్టు తన తీర్పులో మరోసారి గట్టిగా సమర్ధించింది. శాస్త్రీయమైన ప్రాతిపదిక, సమగ్ర సమాచార సేకరణ లేకుండా ఏకపక్షంగా శాతాన్ని పెంచడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన ఈ నిర్ణయంతో… స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలు, రిజర్వేషన్ల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం 50% లోపు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవోలు జారీచేనుంది.

అయితే ఇప్పటికే పార్టీ పరంగా 34% రిజర్వేషన్లను అమలు చేస్తామని టిడిపి ప్రకటించింది. మేయర్, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ ల తో పాటు కౌన్సిలర్లు, వార్డు సభ్యులతో పాటు అన్నిచోట్ల బీసీలకు 34 శాతం టిక్కెట్లను టిడిపికి కేటాయించనంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు