-
భారీ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
-
76 ప్రాంతాలపై మార్పులు
-
ప్రత్యేక ఉత్తర్వులు జారీ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాదులో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహానగరంలో శాంతి భద్రత, పోలీస్ వ్యవస్థ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు.. సిటీ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులను రేసనలైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోయల్ పేరుతో జీవో విడుదలైంది. హైదరాబాద్ సిటీ పరిధిలో జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్లను పునర్వ్యవస్థీకరణ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు చేర్పులు చేసింది. కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఆ మూడు ప్రాంతాల్లో ప్రధానం..
ప్రధానంగా మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధిలో మార్పులు జరిగాయి. ఆర్జిఏఐపిఎస్ పేరును శంషాబాద్ పీఎస్ గా మార్చారు. అలాగే శంషాబాద్ వార్డు 118, కొత్వాల్ గూడ వార్డు 119 పరిధిలోని గ్రామాలను ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విలీనం చేశారు.
శంషాబాద్ డివిజన్లో ఆర్జిఐఏ పిఎస్, శంషాబాద్ పిఎస్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో పలు ప్రాంతాల్లో మార్పులు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్, మీర్ పెట్ ప్రాంతాల పోలీస్ సరిహద్దుల్లో కూడా మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సనత్ నగర్ ప్రాంతాల్లోనూ పరిధిలో పునర్విభజన జరిగింది.
-
సైబర్ సెల్ పరిధులను సైతం..
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్ పరిధి యధాతధంగా కొనసాగుతూనే.. యూనివర్సిటీ క్యాంపస్ భూభాగమంతా సంపూర్ణంగా ఓయూ పీఎస్ పరిధి కిందకి వచ్చేలా జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ట్రాఫిక్ పోలీస్ పరిధిలోను జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది.
ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోను కొత్తగా జోన్ల కేటాయింపు జరిగింది. అటు జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు జీవో 84 ద్వారా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ అధికారిక విజిట్ ప్రత్యేక సంచికలో ప్రచురిస్తున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.
