టపాసులతో రీల్ చేస్తుండగా జరిగిన ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బెల్లంపూడిలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
చిలకలూరిపేటకు చెందిన భూమా సురేష్ తన కుమారుడితో కలిసి ఓ దుకాణం ముందు టపాసులు కాలుస్తూ వీడియో తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కాల్చిన టపాసులు అనుకోకుండా దుకాణం లోపల పడటంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో దుకాణంలో ఉన్న సురేష్ బయటకు రాలేక తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో వాచ్మెన్ మస్తాన్‌రావుకు కూడా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read: తొక్కించి చంపుతా.. విద్యార్థిపై డిపో బస్సు డ్రైవర్ దాష్టీకం!
