తెలంగాణలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బాపూజీనగర్ గణపతి ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఏకంగా రూ.1.45 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో స్వామివారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఈ ప్రత్యేక అలంకరణను చేపట్టారు. వివిధ విలువల నోట్లను ఉపయోగించి గణనాథుడి విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీంతో గణపతి ‘ధనలక్ష్మీ గణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ ప్రత్యేక అలంకరణను ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన మెహర్ బాబా డెకరేషన్ బృందం చేపట్టింది. పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను వినియోగించి చేసిన అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రూ.కోటిన్నరపైగా విలువైన నోట్లతో అలంకరించిన గణపతిని దర్శించుకునేందుకు పాల్వంచతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక అలంకరణతో బాపూజీనగర్ పరిసరాలు పండుగ సందడితో కళకళలాడుతున్నాయి.
also read: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్ఐ మృతి
