Homeక్రైమ్శంషాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

శంషాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

శంషాబాద్‌ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వినాయక నిమజ్జన వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు వినాయక నిమజ్జన కార్యక్రమం అనంతరం ఇన్నోవాలో శంషాబాద్‌ వైపు బయలుదేరారు. జాతీయ రహదారిపై పాలమాకుల గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాట్రావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45) తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మృతుల్లో లింబ్యా, మాన్‌సింగ్, వశ్రామ్ వ్యాపారాలు నిర్వహిస్తుండగా.. జమున గృహిణిగా ఉన్నారు.

కాగా, కారు నడుపుతున్న సబావత్ అశోక్‌ తీవ్రంగా గాయపడటంతో వెంటనే శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. వేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read: బేగంబజార్ గణేశ్ విగ్రహంపై వైరల్ ప్రచారం.. అసలు నిజం ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు