-
సీఎం చైర్ లో తలసాని
-
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్
-
కనీసం ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని సూచన
-
కాంగ్రెస్ రివర్స్ పంచ్ తో ఇరకాటంలో గులాబీ పార్టీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బిఆర్ఎస్ మాక్ అసెంబ్లీ ఆ పార్టీకి రివర్స్ అవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ గులాబీ పార్టీ.. మాక్ అసెంబ్లీ నిర్వహించింది. ప్రత్యేక సెప్ట వేసింది కూడా దానికోసం.
ఈ మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టారు. అయితే దానిని ఒక పొలిటికల్ అస్త్రంగా మార్చుకుంటుంది కాంగ్రెస్. కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దళితులపై అంత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్ కుమార్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టవచ్చు కదా అంటూ సవాల్ చేశారు. ఇప్పుడు అదే తలసానిని మాక్ అసెంబ్లీలో సీఎం చైర్ లో కూర్చోబెట్టడాన్ని కాంగ్రెస్ హైలెట్ చేస్తోంది.
-
అధికార పార్టీకి అస్త్రం..
మాక్ అసెంబ్లీని పట్టుకొని ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. మాటలు చెప్పడం కాదు ముందు మీ పార్టీలో అమలు చేయండి. సీఎం సీటులో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కూర్చోబెట్టండి అంటూ కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. గులాబీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉంది.
సీఎం కాకుంటే కనీసం ప్రతిపక్ష నేతలు చేయండి అంటూ సవాల్ విసిరుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు హాజరవడం లేదు. ఆ పోస్టు ఖాళీగా ఉంది. అందుకే బీసీ వర్గానికి చెందిన తలసానికి ప్రతిపక్షనేత బాధ్యత ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్నను బాగా హైలెట్ చేస్తోంది.
-
చాలా అంశాలు తెరపైకి..
గులాబీ పార్టీ మాక్ అసెంబ్లీ నిర్వహించడం తర్వాత కొన్ని అంశాలు హైలెట్ అవుతున్నాయి. సభకు కేసిఆర్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్న ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అసెంబ్లీకి రారు కదా మాకు అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా అనే మాట కూడా వినిపించింది.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ ప్రయత్నించింది. అయితే ఇప్పుడు అదే గులాబీ పార్టీ కార్నర్ అవుతోంది. ఒకవైపు తలసాని చేసిన దళిత సీఎం కామెంట్స్.. మరోవైపు మాకు అసెంబ్లీలో ఆయనకు సీఎం కుర్చీ.. ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పొలిటికల్ కౌంటర్ ఇస్తోంది. మాక్ అసెంబ్లీతో గులాబీ పార్టీకి అనుకున్న మైలేజ్ దక్కలేదు. పైగా కాంగ్రెస్‌కు రివర్స్ అస్త్రం అందించింది.
