క్రైమ్ మిర్రర్ : భర్త, కుమార్తెతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో శ్యామ్‌సుందర్ తన భార్య సోనీ, 11 ఏళ్ల కుమార్తె శాన్వితో కలిసి యూనికార్న్ బైక్‌పై ఆరాంఘర్ నుంచి షాద్‌నగర్ వైపు ప్రయాణిస్తున్నారు. సిద్ధాంతి రైల్వే గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బైక్‌పై వెనుక కూర్చున్న సోనీ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో డీసీఎం ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో శ్యామ్‌సుందర్, ఆయన కుమార్తె శాన్వికి కూడా గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డీసీఎంను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను గుర్తించారు. అతడిని కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సిందనూరు తాలూకాకు చెందిన బసవరాజ్‌గా పోలీసులు తెలిపారు. మృతురాలు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలానికి చెందిన బి. సోనీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : ఆళ్ల నాని హఠాన్మరణం…!
