పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధర్మారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ సోమవారం కరీంనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గౌతమ్ గతంలో కటికనపల్లి గ్రామంలోని పల్లె దవాఖానలో వైద్యుడిగా విధులు నిర్వహించారు. అయితే సుమారు రెండు నెలల క్రితం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలో పనిచేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆయన కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గౌతమ్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే విషాదం
