Homeఆంధ్ర ప్రదేశ్తల్లి, చెల్లి తో జగన్ రాజీ...!

తల్లి, చెల్లి తో జగన్ రాజీ…!

  • సెటిల్మెంట్ దిశగా అడుగులు

  • పాత ఒప్పందం ప్రకారం ఆస్తుల బదలాయింపునకు సిద్ధం

  • విజయమ్మ, షర్మిలను దగ్గర చేసుకునే పనిలో వైసీపీ అధినేత

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్నారా? తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల తో సంధికి ప్రయత్నిస్తున్నారా? ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవాలని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసేందుకు అది అనివార్యమా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

కుటుంబ విషయంలో జగన్ తన తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. కుటుంబ అంతర్గత కలహాలతో పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగింది. ఊహించని నష్టం జరిగింది. ఇది కొనసాగింపుగా ఉండకూడదు అని కొందరు అత్యంత సన్నిహితులు సూచించడంతో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది.

  • షర్మిల టార్గెట్..

మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం మాత్రం షర్మిల. ఎన్నికల సమయంలో చెల్లి షర్మిల తో పాటు తల్లి విజయమ్మ బహిరంగ లేఖలు రాయడం, పంపకాలపై కోర్టు మెట్లు ఎక్కడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీసింది.

ఇంట్లోనే న్యాయం చేయలేని నాయకుడు.. రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అది కోలుకోలేని దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అదే వివాదాలు కొనసాగుతుండడం.. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగిస్తే భవిష్యత్తు మరింత అగమ్య గోచరంగా మారుతుందని కొందరు సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

అందుకే జగన్ కుటుంబ వివాదాలను తెరదించాలని.. పల్లెతోపాటు చెల్లెలితో సెటిల్మెంట్ దిశగా పావులు కదుపుతున్నారనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

  • కోటరీ కంటే సొంతవారే నయం..

ఒక వాస్తవాన్ని జగన్ గ్రహించినట్లు తెలుస్తోంది. చుట్టూ కోటరిని నమ్ముకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని.. అదే సొంత వారిని నమ్ముకుంటే కొంతవరకు పరిస్థితి మెరుగుపడుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కుటుంబ సభ్యులతో ఇంతటి వివాదానికి కారణం చుట్టూ ఉన్న కోటరీ అని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది.

వారే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను పొందారు అని జగన్ గ్రహించినట్లు సమాచారం. అందుకే ఇప్పుడు కోటరీని నమ్ముకోవడం కంటే చెల్లెలితోపాటు తల్లితో రాజీ పడడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.

  • పాత ఒప్పందం ప్రకారం..

ప్రధానంగా షర్మిల తో ఆస్తిపరమైన వివాదాలు జగన్మోహన్ రెడ్డికి నడుస్తున్నాయి. ప్రధానంగా సరస్వతి పవర్, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, బెంగళూరు యలహంక ప్యాలెస్ వంటి ఆస్తుల వాటాలను అడుగుతున్నారు షర్మిల. వాటితోనే వారి మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఇప్పుడు రాజీ కుదుర్చుకునే క్రమంలో.. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆస్తులు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేయకుండా ఉండాలని.. రాజకీయంగా సహకరించాలనే షరతు పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు