Homeఆంధ్ర ప్రదేశ్అభివృద్దితోనే ప్ర‌జల్లోకి వెళ్ల‌గ‌లం...సీఎం చంద్ర‌బాబు...

అభివృద్దితోనే ప్ర‌జల్లోకి వెళ్ల‌గ‌లం…సీఎం చంద్ర‌బాబు…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: అభివృద్దితోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌ల‌మ‌ని ప్ర‌జ‌ల్లో సానుకూల అభిప్రాయం క‌లిగేలా చూడాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అనా్న‌రు. ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లను కూడ సానుకూలంగా మార్చుకొని ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల‌న్నారు. అభివృద్దితోనే ఓటు బ్యాంక్ పెంచుకుందామ‌ని పిలుపునిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గూగుల్ వస్తే భారత్‌లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయన్నారు. రాష్ట్రంలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. డేటా సెంటర్లకు కావాల్సిన 5 టీఎంసీల నీరు అసలు సమస్యే కాదన్నారు.

Also Read: నిజామాబాద్‌లో దారుణం…బంగారం కోసం వృద్ధురాలి చెవులు కోసిన దుండగుడు…

అంతేగాకుండా ‘పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే అవకాశం ఉంది. డేటా సెంటర్ల ద్వారా అధిక మొత్తంలో ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉంది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఆ నీటిలో కనీసం 300 టీఎంసీలు వాడుకున్నా పరిస్థితులను మార్చేయవచ్చు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం’

Also Read: కేబినెట్‌లోకి రాజగోపాల్‌రెడ్డి!?.. వెంకట్‌రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది.! 

‘దేశంలో 30 ఏళ్లలో ఊహించని మార్పులు జరిగాయి. మన రాష్ట్రంలో దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన హైవేల నిర్మాణం జరుగుతోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు నిర్మించుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. వెల్త్ క్రియేట్ చేయడానికి డబ్బులు లేవని కూర్చుంటే సరిపోదు. ఆలోచన చేస్తే పరిష్కారం లభిస్తుంది. దేశంలో నంబర్ 1 డెవలపర్ అవ్వడమే నాకు కావాల్సింది. సాస్కి, ప్రభుత్వ నిధులు, నాబార్డ్ వంటి వాటి నుంచి వచ్చే నిధుల వినియోగానికి రూపకల్పన సిద్ధం చేసుకున్నాను. రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్ స్టోరీలు క్రియేట్ చేసుకోవాలి. ఆలోచన మారితే ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. కుప్పం సమీపం నుంచి వెళ్తున్న ఓ జాతీయ రహదారికి దగ్గరిలో ఓ పారిశ్రామిక ప్రాంతాన్ని సృష్టించాం. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాం. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకునేలా మన ఆలోచనలు మారాలి. పబ్లిక్ పాలసీలు రూపొందించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ప్రాజెక్టులు అంతే వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలి. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న అంశాలను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను సూచించండి’ అని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు