క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలు రాష్ట్రాలకు సంబంధించి నూతన ఇన్ఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా పీవీ మోహన్‌ను ఏఐసీసీ నియమించింది. ఏపీతో పాటు మరికొన్ని కీలక రాష్ట్రాలకు కూడా కొత్త ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఇందులో భాగంగా మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సిరివెళ్ల ప్రసాద్, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా సుఖ్‌దేవ్ భగత్‌లను ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నేత సచిన్ పైలట్, గుజరాత్‌కు రణదీప్ సూర్జేవాలా, అస్సాం ఇన్‌ఛార్జ్‌గా మాజీ సీఎం భూపేష్ బఘేల్‌లను నియమించింది.కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ప్రస్తుతం ఉన్న మీనాక్షీ నటరాజన్ యథావిధిగా కొనసాగుతారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్టానం ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?.. రుతురాజ్‌పై వేటుకు చెన్నై సిద్ధం!
నానక్‌రామ్‌గూడ హిట్ అండ్ రన్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి లైసెన్స్ రద్దు
