Homeవైరల్30 ఏళ్లుగా అన్నానికి దూరం.. రోజూ 20 టీలు, వేరుశనగలతోనే జీవనం!

30 ఏళ్లుగా అన్నానికి దూరం.. రోజూ 20 టీలు, వేరుశనగలతోనే జీవనం!

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ మహిళకు సంబంధించిన అరుదైన ఆహారపు అలవాటు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాయికల్ మండలం మైదాపూర్ గ్రామానికి చెందిన కాజమ్మకు అన్నం తినకుండా ఏకంగా మూడు దశాబ్దాలుగా జీవిస్తున్న అలవాటు ఉంది.

కుటుంబ సభ్యులు గతంలో “అన్నం పెట్టడం దండగ” అని అన్న ఓ మాటను మనసులో పెట్టుకున్న కాజమ్మ.. అప్పటి నుంచి అన్నానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లుగా అన్నం తినకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రస్తుతం కాజమ్మ రోజుకు దాదాపు 20 కప్పుల టీ తాగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు రోజుకు రెండు, మూడు సార్లు వేరుశనగలు తింటూ జీవనం సాగిస్తున్నారట. ఇవే తనకు ప్రధాన ఆహారంగా మారాయని ఆమె పేర్కొన్నారు.

ఇంతకాలం అన్నం తినకపోయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం అన్నం తినాలనే కోరిక కూడా కలగడం లేదని కాజమ్మ చెబుతున్నారు. ఆమె ఆహారపు అలవాట్ల గురించి తెలిసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మన ఆహారంలో అన్నం ప్రధాన భాగంగా ఉండగా.. మూడు దశాబ్దాలుగా దానికి దూరంగా ఉంటూ టీ, వేరుశనగలతో జీవనం సాగిస్తున్న కాజమ్మ విషయం గ్రామంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఇలాంటి అసాధారణ ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

also read: రామ్ చరణ్‌ శ్రీకృష్ణుడిగా.. ‘లాలో’ తెలుగు రీమేక్‌లో గ్లోబల్ స్టార్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు