తిరుపతికి చెందిన 50 ఏళ్ల అరుణ తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా పొడటూర్‌పేట సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువుల వివాహానికి వెళ్లిన ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పొడటూర్‌పేట సమీపంలోని ముళ్లపొదల్లో అరుణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె ముఖంపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు ఉండటంతో ఘటన తీవ్ర కలకలం రేపింది. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న సుమారు 20 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో.. దుండగులు దోపిడీ కోసమే హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అరుణ ఎవరిని కలిశారు? ఆమెను ఎవరు, ఎందుకు హత్య చేశారు? నగల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: సూర్యాపేట జిల్లాలో దారుణం.. వేపచెట్టు విషయంలో ఘర్షణ.. ఇద్దరు మృతి
