HomeUncategorizedగిరిజ‌న గురుకుల ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌...! 62 ఏళ్ల వ‌ర‌కు రిటైర్‌మెంట్‌

గిరిజ‌న గురుకుల ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌…! 62 ఏళ్ల వ‌ర‌కు రిటైర్‌మెంట్‌

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గిరిజ‌న ఉద్యోగుల‌కు శుభ‌వార్త తెలిపింది. గిరిజ‌న ఉద్యోగుల‌కు 62 ఏళ్ల వ‌ర‌కు రిటైర్‌మెంట్ పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీటీడ‌బ్ల్యుఆర్ ఎస్‌(గురుకులం) రెగ్యుల‌ర్ బోధ‌న‌, బోధ‌నేత‌ర ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. జులై 2026 నుంచి రిటైర్ అయ్యే అర్హులైన ఉద్యోగులకు కొనసాగింపు ఉంటుందని తెలిపింది.

Also Read: పశ్చిమ బెంగాల్‌లో ‘వందేమాతరం’ తప్పనిసరేనా? సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

ఫైనాన్స్ శాఖ జీవో నంబర్-45 నిబంధనల మేరకు ఈ ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. రీ-ఇండక్షన్ కాలానికి వేతన బకాయిలు ఉండవని చెప్పింది. అదనపు పోస్టులను సృష్టించకుండా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. 2026-27 బడ్జెట్ పరిధిలోనే వ్యయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే 28 మంది బోధన సిబ్బందికి కూడా రూ.4.12 కోట్ల అదనపు నిధుల ప్రతిపాదన చేస్తామని తెలిపింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ -33ను జారీ చేసింది.

Also Read:పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై UIDAI కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30లోపు ఈ పని పూర్తి చేయండి!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు