క్రైమ్ మిర్రర్, సినిమా:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక చల్లని కబురు! ప్రముఖ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవేటెడ్ మరియు క్రేజీ ప్రాజెక్ట్ ‘OG’ సీక్వెల్, ‘OG-2’ షూటింగ్ వాయిదా పడుతుందన్న పుకార్లకు సినీ వర్గాలు చెక్ పెట్టాయి. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని స్పష్టం చేశాయి.గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గాయం కారణంగా రెస్ట్ మోడ్‌లో ఉన్నారని, దీంతో ఆయన సినిమా షూటింగ్‌లు ఆలస్యం అవుతాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ‘OG-2’ షూటింగ్ వాయిదా పడుతుందని, ఈ గ్యాప్‌లో సుజీత్ హీరో నానితో ఒక సినిమా చేయనున్నారని, ఆ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందని పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు పవన్ అభిమానుల్లో కొంత ఆందోళన రేకెత్తించాయి.అయితే, ఈ రూమర్స్‌పై తాజాగా క్లారిటీ వచ్చింది. ‘OG-2’ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే నవంబర్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుండి షూటింగ్‌లో పాల్గొనేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.సుజీత్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ స్టైలిష్ లుక్, సుజీత్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తాజా అప్‌డేట్‌తో ‘OG-2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ప్యాకేజీ కాదు.. అసలు పాన్ మసాలానే బ్యాన్ చేయండి!
కుమార్తె హత్య కేసులో దంపతులకు జీవిత ఖైదు
