Homeసినిమా100 ఏళ్లలో నా ఫేవరేట్ మూవీ అదే.. రాజమౌళికి ఇంతగా నచ్చిన సినిమా ఏదో తెలుసా?

100 ఏళ్లలో నా ఫేవరేట్ మూవీ అదే.. రాజమౌళికి ఇంతగా నచ్చిన సినిమా ఏదో తెలుసా?

క్రైమ్ మిర్రర్,సినిమా:- దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌తో పాటు అంతర్జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన సినిమా ఏదో వెల్లడించారు. తనను మానసికంగా ప్రేరేపించే ఆ మూవీ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.దర్శకుడిగా స్టూడెంట్ నంబర్ 1 తో ప్రయాణం ప్రారంభించిన రాజమౌళి.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. అయితే తనకు అత్యంత స్ఫూర్తినిచ్చిన సినిమాల్లో ఒకటి మాత్రం బాలీవుడ్‌కు చెందిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ అని రాజమౌళి వెల్లడించారు.గత వందేళ్లలో తనకు నచ్చిన సినిమాల గురించి ప్రశ్నించగా.. ఎన్నో చిత్రాలు తనకు ఇష్టమని, అయితే తన ఫేవరేట్ మూవీ మాత్రం రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ అని తెలిపారు. హిరాణీ కథను ఆలోచించిన విధానం, కాన్సెప్ట్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. తాను కూడా అలాంటి కొత్త ఆలోచనలు, భావోద్వేగాలతో కూడిన కథలను రూపొందించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

వారణాసిలో శ్రీరాముడిగా మహేశ్ బాబు.. హనుమంతుడిగా ఎవరంటే?

మున్నాభాయ్ ఎంబీబీఎస్ 2003లో విడుదలైంది. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్షద్ వార్సీ, సునీల్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్యంతో పాటు బలమైన భావోద్వేగాలను మేళవించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వైద్యుడు కేవలం చికిత్స చేయడం మాత్రమే కాకుండా రోగిని మానవత్వంతో చూడాలనే సందేశాన్ని వినోదాత్మకంగా అందించింది.ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాజమౌళి స్వయంగా మున్నాభాయ్ ఎంబీబీఎస్ ను తన ఫేవరేట్ మూవీగా పేర్కొనడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

శంకర్ కొత్త సినిమాతో రిస్క్ చెయ్యనున్న మరో స్టార్ హీరో!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు