Homeఅంతర్జాతీయందట్టమైన అటవీలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం

దట్టమైన అటవీలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం

క్రైమ్ మిర్రర్ : బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రియో డి జనీరోలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హెలికాప్టర్ పైలట్‌తో పాటు కొలంబియాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11:11 గంటల సమయంలో ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్ అదుపుతప్పి అటవీ ప్రాంతంలో పడిపోయిన వెంటనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దట్టమైన అడవిలో హెలికాప్టర్ శిథిలాలను గుర్తించి, మంటలను ప్రత్యేక బృందాల సహాయంతో అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే హెలికాప్టర్‌లో ఉన్న నలుగురూ మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

హెలికాప్టర్ రాకపోకలపై ఆందోళన

ఈ ప్రమాదంపై రియో డి జనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. నగర పరిధిలో హెలికాప్టర్ల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై మరింత కఠినమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. హెలికాప్టర్ కార్యకలాపాలపై తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (ANAC)ను కోరినట్లు మేయర్ తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులకు నగర పాలక సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

వరుస ప్రమాదాలతో ఆందోళన

రియో డి జనీరోలో ఇటీవల చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. అంతకుముందు సావో పాలో రాష్ట్రంలోని ఉబటుబాలో చిన్న విమానం ప్రమాదానికి గురై పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. తాజా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? లేక ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు