క్రైమ్ మిర్రర్ : సిద్దిపేట జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడిపై అతని తండ్రి వేడి నీళ్లు పోసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రేవర్తి కిషన్‌కు తన భార్యతో కొంతకాలంగా కుటుంబ విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆ సమయంలో అక్కడే ఉన్న వారి ఎనిమిదేళ్ల కుమారుడు రుత్విక్ నవ్వడంతో కిషన్ ఆగ్రహానికి గురై ఇంట్లో వేడిగా ఉన్న నీటిని బాలుడిపై పోయడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిపై దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
also read : ‘సై’ విలన్ ఇకలేరు.. నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మృతి
