Homeవైరల్కదులుతున్న లోకల్ ట్రైన్ కిందకు దూకబోయిన వ్యక్తి... కాపాడిన మహిళా కానిస్టేబుల్

కదులుతున్న లోకల్ ట్రైన్ కిందకు దూకబోయిన వ్యక్తి… కాపాడిన మహిళా కానిస్టేబుల్

ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ అప్రమత్తత ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. క్షణాల్లో స్పందించి ప్రమాదాన్ని అడ్డుకున్న ఆమె ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం రాత్రి దాదాపు 10:54 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై నుంచి ఓ లోకల్ రైలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో, 28 ఏళ్ల ఓ యువకుడు రైలు కిందకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఏ. నర్వాడే పరిస్థితిని గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరుగెత్తుకెళ్లి, యువకుడిని వెనక్కి లాగి ప్రమాదం నుంచి బయటపడేశారు. ఆమె వేగవంతమైన స్పందనతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. యువకుడికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ అందించినట్లు సమాచారం. అతడి మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

మహిళా కానిస్టేబుల్ చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలను కాపాడేందుకు ఆమె చూపిన ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. “సమయస్ఫూర్తితో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు”, “ఇలాంటి పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం” అంటూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

also read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. గుండుతో కనిపించిన స్టార్ క్రికెటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు