Homeతెలంగాణది ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ కు నందమూరి హీరో బిగ్ ఛాన్స్...!

ది ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ కు నందమూరి హీరో బిగ్ ఛాన్స్…!

హైద‌రాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌:ది ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచిన తర్వాత దర్శకుడు పరశురాం పెట్ల మరో కొత్త ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌కు పరశురాం ఓ కొత్త కథ వినిపించగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, పరశురాం చెప్పిన బేసిక్ స్టోరీ లైన్ కళ్యాణ్ రామ్‌కు నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి రావాలని సూచించినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read:  చిత్తూరు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక పరశురాం సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
పరశురాం కెరీర్ విషయానికి వస్తే, గీత గోవిందం తో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన, ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారి పాట తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించింది. అయితే విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Also Read:నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, నిందితుడిపై పోక్సో కేసు

దీంతో కొంతకాలంగా కొత్త సినిమా ప్రకటించని పరశురాం, ఇప్పుడు నందమూరి హీరోతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు