Homeఆంధ్ర ప్రదేశ్మదనపల్లిలో సినీ స్టైల్ ఏటీఎం దోపిడీ.. రూ.13 లక్షల నగదు మాయం

మదనపల్లిలో సినీ స్టైల్ ఏటీఎం దోపిడీ.. రూ.13 లక్షల నగదు మాయం

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం తెల్లవారుజామున ఏటీఎం దోపిడీకి గురైంది. గుర్తు తెలియని దుండగులు ముందుగా ప్లాన్ చేసుకుని ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్నారు.

సమాచారం ప్రకారం, బొలెరో వాహనంలో వచ్చిన దొంగలు ఏటీఎం యంత్రాన్ని పూర్తిగా ఎత్తుకెళ్లారు. అనంతరం దాన్ని మరొక కంటైనర్ లారీలోకి మార్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దోపిడీ విషయమై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లో పూర్తి నిఘా పెంచి వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఎస్‌బీఐ పరిపాలనా అధికారి మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏటీఎంలో ఉన్న సుమారు రూ.13,05,000 నగదు దొంగల చేతికి చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: టైఫాయిడ్‌తో బాధపడుతున్న అభిజిత్ దీప్కే – యువత ఉద్యమానికి మద్దతు, త్వరలోనే తిరిగి చేరతానని హామీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు