శ్రీకాకుళం, క్రైమ్‌మిర్రర్: శాసనసభాపతిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, చట్టాలను కాపాడాల్సిన స్థానంలో కూర్చుని నీతులు చెప్పిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అక్రమాల జాతకం ఇప్పుడు ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది. ఒకప్పుడు ఆముదాలవలస రాజకీయాన్ని ఏలిన తమ్మినేని, ఆయన కుటుంబం చేసిన అడ్డగోలు భూకబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్ల దందాలు ఇప్పుడు వెలుగులోకి వస్తుండటంతో తీవ్ర కలకలం రేగుతోంది. భూకబ్జా, ఫోర్జరీ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఆలస్యం.. ఆయన తన భార్య, కుమారుడితో సహా రాత్రికి రాత్రే పరారవ్వడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బ్రతికున్న వ్యక్తులను చనిపోయినట్లు చూపిస్తూ, వారి వారసులమంటూ ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూములను కాజేసిన ఒక నకిలీ దస్తావేజుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. అసలైన యజమానులు బ్రతికే ఉన్నప్పటికీ, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ కాగితాలు సృష్టించి అడ్డగోలుగా తమ పేరున దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే బలమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read:కావాలని నోబాల్ వేస్తే సస్పెండ్.. డొమెస్టిక్ క్రికెట్‌లో BCCI కీలక మార్పులు!
ఈ వ్యవహారంలో పోలీసులు విచారణ జరిపి తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ , తమ్మినేని సీతారాం , ఆయన భార్య తమ్మినేని వాణి లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని తమ్మినేని కుటుంబం ఆముదాలవలస నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో వేల గజాల ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను, ప్రభుత్వ భూములను భయభ్రాంతులకు గురిచేసి కాజేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. బాధిత భూయజమానులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా, నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయనకున్న రాజకీయ ప్రాబల్యం వల్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేయడానికి కూడా జంకారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, బాధిత కుటుంబాలు ఆధారాలతో పోలీసులను ఆశ్రయించడంతో తమ్మినేని పాపాల పుట్ట పగిలింది.శాసనసభలో సభాపతిగా విలువలు, నైతికతల గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చిన తమ్మినేని.. తీరా చూస్తే ప్రైవేటు వ్యక్తుల కష్టార్జితమైన ఆస్తులపై కన్నేసి అక్రమాలకు పాల్పడటంపై ఆముదాలవలస ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read:తల్లికి వందనం.. నేడే అకౌంట్లలోకి నిధులు..!
ప్రస్తుతం పోలీసులు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకప్పుడు అధికారం చూపి బెదిరించిన నేతలు, నేడు కేసు నమోదవ్వగానే చట్టం నుంచి తప్పించుకోవడానికి పరారవ్వడంపై స్థానికులు మండిపడుతుండగా, తవ్వే కొద్దీ తమ్మినేని కబ్జాల లెక్కలు మరిన్ని బయటకు రానున్నట్లు తెలుస్తోంది
గ్రీవెన్స్ లో వృద్ధ దంపతుల ఫిర్యాదు…
Also Read:నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. కేంద్రానికి TVK డిమాండ్!
కొద్దిరోజుల కిందట ఓ వృద్ధ దంపతులు తమ్మినేని కుటుంబ సభ్యులపై ఏకంగా కలెక్టరేట్ గ్రీవెన్స్ లోనే ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టిఎస్ఆర్ కళాశాలకు సమీపంలో ఓ వృద్ధ దంపతులకు 8 సెంట్లు స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసిందంటూ ఆ వృద్ధ దంపతులు సీఎంవో తో పాటు ఎస్పీ నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆమదాలవలస తహసిల్దార్, సర్వే అధికారులు వెళ్లి స్థలాన్ని బాధితులకు అప్పగించారు. అయితే ఇది జరిగి వారం రోజుల వ్యవధి కూడా కాలేదు.. శ్రీకాకుళం లో నాలుగు కోట్ల విలువైన భూమిని అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకోవడం వెలుగులోకి వచ్చింది.మరోవైపు టెక్కలి మండలం చింతామణి గ్రామంలో ఏకంగా 23 ఎకరాల భూమిని తన కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
Also Read:చల్లపల్లిలో విషాదం: మద్యం మత్తులో కొడుకు హింస… ఆత్మరక్షణలో తల్లి దాడి, యువకుడు మృతి
తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్న సమయంలోనే చింతామణి గ్రామంలోని 324 సర్వే నెంబర్ లో భూమిపై ఆయన కన్ను పడినట్లు తెలుస్తోంది. గ్రామస్తులను భయపెట్టి మరి బలవంతంగా రాయించుకున్నారని శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి తమ్మినేని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన మరణించిన తర్వాత వారసులు మధ్య గొడవలు జరిగాయి. అయితే వారి ఇల్లును తమ్మినేని సీతారాం భార్య వాణి బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలసకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోయారు. అయితే తమకు కొంత మొత్తం అప్పుగా ఉన్నారని చెప్పి.. ఆయన కుటుంబాన్ని బెదిరించి ఒక ఇల్లును బలవంతంగా లాక్కున్నారని ఆరోపణ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండడంతో తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.