విజయనగరం జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన యువతి శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుసుకున్న వివరాల ప్రకారం, ఈ నెల ప్రారంభంలోనే శ్రీలక్ష్మి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజులకే కుటుంబంలో వ్యక్తిగత విషయాలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీలక్ష్మి, పురుగుల మందు సేవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
also read: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి