HomeసినిమాBhagyashree Borse: భాగ్యశ్రీ సక్సెస్ జోస్.. మనసులో కోరిక బయటపెట్టేసిందిగా!

Bhagyashree Borse: భాగ్యశ్రీ సక్సెస్ జోస్.. మనసులో కోరిక బయటపెట్టేసిందిగా!

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విజయం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భారతి’ పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ  నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మెచ్చుకోబడుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. కానీ ‘లెనిన్’ కథ మాత్రం చాలా బాగుంది. మేమంతా ఈ సినిమా మీద గట్టిగా నమ్మకం ఉంచాం. ఆ నమ్మకం నిజమైనందుకు ఈ విజయం మరింత భావోద్వేగంగా అనిపిస్తోంది’’ అని అన్నారు. ‘భారతి’ పాత్రను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడం తనకు చాలా సంతోషం అని భాగ్యశ్రీ తెలిపారు. అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ, ‘‘అఖిల్ చాలా అద్భుతమైన నటుడు. ఆయనకు ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది.

భవిష్యత్‌లో ‘మహారాణి’, ‘యువరాణి’ లాంటి బలమైన పాత్రలు చేయాలని తన కోరిక ఉందని భాగ్యశ్రీ పేర్కొన్నారు. అలాంటి భారీ చిత్రాలకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం ఇవ్వాలని తన మనసులో ఉందని, ఒకరోజు ఆయనతో పని చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పింది. తన కెరీర్ మొదలైనప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు తనపై చూపుతున్న ప్రేమ అపారమని భాగ్యశ్రీ చెప్పింది. ‘‘వారు నన్ను తెలుగు అమ్మాయిలాగే చూస్తున్నారు. హైదరాబాద్ మరియు తెలుగు సినిమా పరిశ్రమ నాకు చాలా ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని ఆమె చెప్పింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు