HomeసినిమాActress Hema: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న నటి హేమ.. సోషల్ మీడియాలో రచ్చ!

Actress Hema: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న నటి హేమ.. సోషల్ మీడియాలో రచ్చ!

నటి హేమ తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మోడల్ కారును తన గ్యారేజీలోకి తెచ్చుకుంది. ఈ కారు ధర సుమారు 1.65 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అద్భుతమైన సేఫ్టీ సిస్టమ్స్‌తో ఈ కారు చాలా విలాసవంతంగా ఉంటుంది.

హేమ కారులో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘‘చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ, కొందరు మాత్రం ‘‘ఇంత ఖరీదైన కారు ఎలా కొన్నది? ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?’’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం హేమ కారు వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రెండేళ్ల క్రితం హేమ బెంగళూరు డ్రగ్స్ కేసులో పేరు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ సమయంలో ఆమె బ్లడ్ రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయని వార్తలు వచ్చాయి. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెపై చర్యలు తీసుకుంది. కానీ తర్వాత ఆమె తప్పు లేదని తేలడంతో హేమ ఈ కేసు నుంచి బయటపడింది.  ప్రస్తుతం హేమ సినిమా రంగంలో బిజీగా ఉంది. పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను మళ్లీ సక్రమంగా కొనసాగిస్తోంది. కొత్త కారు కొనుగోలు తర్వాత ఒకవైపు శుభాకాంక్షలు, మరోవైపు విమర్శలతో హేమ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు