Homeతెలంగాణ2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం పూర్తి: రామ్మోహన్ నాయుడు

2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం పూర్తి: రామ్మోహన్ నాయుడు

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ఎయిర్ పోర్ట్‌ను దేశంలోనే అత్యుత్తమ సాంస్కృతిక, అందమైన టెర్మినల్‌గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రజలతో పాటు అన్ని వర్గాల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.అదేవిధంగా, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి 1,700 ఎకరాల భూమి అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడితే అక్కడ కూడా విమానాశ్రయం నిర్మిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ఏపీ విద్యార్థులకు శుభవార్త: ఈ నెల 24లోగా తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు!

Nitin Gadkari: ఈ20 పెట్రోల్ పై అపోహలు వద్దు.. మంత్రి గడ్కరీ క్లారిటీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు