తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కిరాతకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక పోక్సో కేసు నేపథ్యంలో కక్ష పెంచుకున్న వ్యక్తి ఆరుగురిని అమానుషంగా హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
స్థానిక సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తిపై కొద్ది రోజుల క్రితం ఓ బాలికను వేధించిన కేసులో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మే 26న అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు శుక్రవారం తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.
గ్రామానికి వచ్చిన వెంటనే ప్రతీకారంతో ఉన్మాదంగా ప్రవర్తించిన రాజ్‌కుమార్, ముందుగా తన ఇంటికెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను హతమార్చాడు. ఆ తర్వాత ఆగ్రహంతో బాధిత బాలిక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆమె తల్లి మరియు నాయనమ్మలను కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం.
ఇంతటితో ఆగని నిందితుడు, బాలికను గ్రామ శివార్లకు తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం ఆమెను కూడా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో మొత్తం ప్రాంతం షాక్‌కు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.
ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
also read: విశాఖ టేకీ రాధా గాయత్రి కేసులో కీలక మలుపు… భర్త శ్రీచరణ్‌కు నోటీసులు