Homeతెలంగాణరేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉచితంగా బైకులు, స్కూటీలు పంపిణీ

రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉచితంగా బైకులు, స్కూటీలు పంపిణీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్న రేవంత్‌ సర్కార్‌.. తాజాగా మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. క్రిస్టియన్‌ మైనార్టీలకు ఉచితంగా బైకులు, స్కూటీలు, కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్ధీన్‌ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఆయా వర్గాలకు మేలు చేకూరనుంది. వీటి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేలా అవకాశాన్ని కల్పించానలి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీటిని అర్హులైన వారికి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోర్టల్‌ ద్వారా క్రిస్టియన్‌ మైనార్టీలు దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఈ వర్గాల యువత చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం శక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం బైకులు, స్కూటీలు, కుట్టు మిషన్లు, మోటార్‌ బైకులు, చిన్న వ్యాపార యూనిట్లు మంజూరు చేయనుంది.

అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక..

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూలై మూడోతేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూలై 18 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం కోసం విధివిధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో ఉంటున్న వాళ్లు లబ్ధి పొందాలంటే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు లోపు ఉండాలి. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూఇనట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని, బైక్‌, స్కూటీ కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలని సంక్షేమశాఖ అధికారులు విడుదల చేసిన విధి విధానాల్లో పేర్కొన్నారు. ఇకపోతే, ఈ పథకానికి సంబంధించిన సందేహాల కోసం 040-23391067 నెంబర్‌కు సంప్రదించాలని అధికారులు సూచించారు. అర్హులైన దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని తెలంగాణ క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు. తాజా నిర్ణయం పట్ల మైనార్టీ వర్గాలకు చెందిన వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Nikah Halala: మతం ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులా? నిఖా హలాలాపై హైకోర్టు షాకింగ్ కామెంట్స్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు