Homeఆంధ్ర ప్రదేశ్అమరావతి నేల రాజధానికి పనికిరాదు: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అమరావతి నేల రాజధానికి పనికిరాదు: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి నేల రాజధాని నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని రాష్ట్రానికి ఒక ‘గుదిబండ’గా అభివర్ణించారు. గత ప్రభుత్వం కేవలం స్కాములు చేయడానికి, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని సజ్జల ఆరోపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమరావతి నిర్మాణానికి వెచ్చిస్తున్న భారీ నిధులలో కనీసం 10 శాతం నిధులను మావిగన్‌లో పెట్టినా ఎంతో అభివృద్ధి సాధించవచ్చని ఆయన అన్నారు.

వైభవ్ ను పొగడొద్దు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు!

అమరావతి నేల స్వభావంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నేల కుంగిపోతుందని, రాజధాని నిర్మాణానికి పనికిరాదని గతంలోనే పలువురు నిపుణులు హెచ్చరించారని ఆయన గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రూ. 47 వేల కోట్ల అప్పుతో ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చని సజ్జల సూచించారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, అలాగే పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా కాలువ పనులను పూర్తి చేయవచ్చని ఆయన మీడియా సమావేశంలో వివరించారు.సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజధానిపై మరోసారి రాజకీయ దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…! మంత్రి నారా లోకేష్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు