Homeసినిమాప్రభాస్ ‘స్పిరిట్’ అప్‌డేట్.. శరవేగంగా షూటింగ్!

ప్రభాస్ ‘స్పిరిట్’ అప్‌డేట్.. శరవేగంగా షూటింగ్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరుగుతుండటంతో, ఎక్కడా ఎలాంటి వాయిదాలు పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ముందుగా ప్రకటించిన విధంగానే మార్చి 5, 2027న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తన సంకల్పం.. 116 ఏళ్ల వయస్సులోనూ ఎంచక్కా తిరుమల కొండ ఎక్కేసింది..!!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. అన్ని పదవులకు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు