క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ షాపుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో ఏకంగా 3,800కి పైగా రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆయా మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా స్థానిక అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు.నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.
అభ్యర్థి తప్పనిసరిగా రేషన్ షాపు ఉన్న స్థానిక గ్రామం లేదా పట్టణ వాసి అయి ఉండాలి.వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.కనీసం 10వ తరగతి (టెన్త్) లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ స్థానిక తహసీల్దార్ (ఎంఆర్ఓ) లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో సాధించిన మెరిట్ ఆధారంగా రేషన్ డీలర్లను ఎంపిక చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని అధికారులు భావిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే స్థానిక కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. అన్ని పదవులకు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా!!
డయల్-100కు వెంటనే స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కల్హేర్ పోలీసులు..