Homeఅంతర్జాతీయంSexual Partners: బాడీ కౌంట్‌ లో టర్కీ టాప్.. భారతీయుల సగటు ఎంతంటే?

Sexual Partners: బాడీ కౌంట్‌ లో టర్కీ టాప్.. భారతీయుల సగటు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ప్రజల వ్యక్తిగత సంబంధాలు, జీవనశైలి, సామాజిక విలువలు దేశానికోలా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ ‘గ్లోబల్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసిన 2026 నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోని 50 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం, ఒక వ్యక్తి జీవితకాలంలో కలిగి ఉండే సగటు లైంగిక భాగస్వాముల సంఖ్యను పరిశీలించారు.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచ సగటు తొమ్మిది మంది భాగస్వాములు. ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ ఒక వ్యక్తికి సగటున 14.5 మంది లైంగిక భాగస్వాములు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. టర్కీ తర్వాత ఆస్ట్రేలియా 13.3 సగటుతో రెండో స్థానంలో, న్యూజిలాండ్‌ 13.2తో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఐస్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్‌, నార్వే, ఇటలీ, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో కూడా సగటు భాగస్వాముల సంఖ్య పదికి మించి ఉంది. అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో నిలిచింది. బ్రిటన్‌ 9.8 సగటుతో 21వ స్థానంలో ఉంది. ఆసక్తికరంగా అమెరికాలో రాష్ట్రాల వారీగా కూడా ఈ సంఖ్యల్లో భారీ తేడాలు కనిపించాయి. లూసియానాలో సగటు 15.7 కాగా, సంప్రదాయ విలువలు ఎక్కువగా పాటించే యూటాలో అది కేవలం 2.6 మాత్రమే.

మరోవైపు, ఆసియా దేశాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా భారత్‌లో లైంగిక భాగస్వాముల సగటు సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల్లో భారత్‌ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున ముగ్గురు భాగస్వాములను మాత్రమే కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం, కుటుంబ విలువలు, సంప్రదాయాలు, పెళ్లికి ముందు సంబంధాలపై సమాజంలో ఉన్న పరిమిత ఆమోదం ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ఇదే పరిస్థితి హాంకాంగ్‌, వియత్నాం, చైనా వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా కనిపించింది. సామాజిక నిబంధనలు, సంస్కృతి, మత విశ్వాసాలు, సెక్స్‌ ఎడ్యుకేషన్‌ వంటి అంశాలు ప్రజల వ్యక్తిగత సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు